అభివృద్ధి నిధులకై ఎమ్మెల్యేకు సర్పంచ్ రంజిత్ కుమార్ వినతి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, గ్రామపంచాయతీ లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాదెపాడు సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాచేపల్లి శ్రీనివాసరెడ్డి, బత్తుల బాబురావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕