రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రంజిత్ కుమార్

ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం సింగరేణి మండలం గాదె పాడు గ్రామపంచాయతీ సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ సోమవారం మండలంలోని రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసి, పంట భూములు సిరులు పండాలని, అన్నదాతల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాదు శిల్ప కళావేదికలో జరుగనున్న రైతు భరోసా పంపిణీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని, మండలంలోని రైతులు తమకు సమీపంలో ఉన్న రైతు వేదికల వద్దకు మంగళవారం సాయంత్రం చేరుకొని, కార్యక్రమాన్ని వీక్షించాలని గాదె పాడు సర్పంచ్ కోరారు.

సంబంధిత పోస్ట్