సింగరేణి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు మండల తహశీల్దార్, ఆర్ఐ ని కలిశారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, బాలకృష్ణ, నాగరాజు, రవి, సాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.