వైరాలో రాఖీల సందడి

వైరా మండల వ్యాప్తంగా రాఖీలతో పాటు స్వీట్ షాపుల వ్యాపారం జోరందుకుంది. ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌, మార్కెట్‌ ప్రాంతాల్లో టెంట్లు వేసి వివిధ డిజైన్ల రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 నుంచి రూ. 200 వరకు ధరల్లో అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కోసం మహిళలు కొనుగోళ్లలో బిజీ అయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕