జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు, నాయకులు శనివారం వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో పడమటి నర్సాపురం గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తారని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.