రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సీపీఎం కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం కామేపల్లి మండలం కొత్తలింగాలలో సీపీఎం డివిజన్ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించగా.. ఆయన పాల్గొన్ని మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు సహకారం అందించాల్సిన ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మోసం చేస్తుందని, అందించాల్సిన పథకాలన్ని నిలిపివేసి సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.