వైరా: కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ భిక్షతో గెలిచిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం సిగ్గుచేటని డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే అజయ్, తాతా మధు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే వైరా మున్సిపాలిటీలో గెలవాలని సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్