వైరాలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రంలో గురువారం శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన హోమాన్ని కొనసాగింపుకు సంకల్పం చేసి, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా వడ్డించారు.