వైరా: శోభాయాత్రలో ఉద్రిక్తత.. కర్రలు రాళ్లతో దాడులు

వైరా మండలం లాలాపురంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి జరిగిన దేవుడి ఊరేగింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. రాజకీయ నినాదాలతో మొదలైన ఈ వాగ్వాదం కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే స్థాయికి చేరడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైరా సీఐ, కొణిజర్ల ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్