ఖమ్మం జిల్లా వైరా పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ బస్టాండ్ లో భక్తులకు అల్పాహార అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు పాల్గొన్నారు.