వైరా: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సీవై పుల్లయ్య, వైరా డివిజన్ కార్యదర్శి పాశం అప్పారావు డిమాండ్ చేశారు. వైరా, కొణిజర్ల మండల కేంద్రాలైన గుబ్బగుర్తి, ఏన్కూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 ఏండ్ల నుంచి పేద, మధ్య తరగతి ప్రజలపై అనేక భారాలు మోపిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్