ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. మంగళవారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ జీలుగు విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ముందస్తుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం వల్ల భూసారం పెరిగి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.