వైరా మున్సిపల్ కమిషనర్ యు. గురులింగం ఎనిమిది నెలల తర్వాత నల్లగొండ జిల్లా చిట్యాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వైరాకు కొత్త కమిషనర్ ను ఇంకా నియమించలేదు. అధికార పార్టీ నాయకులు కొందరు తమకు అనుకూలమైన వారిని కమిషనర్ గా నియమించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం వైరా మున్సిపల్ కార్యాలయంలో అనిశ్చితిని సృష్టిస్తోంది.