వైరా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడు రాంబాబు నాయక్ ఆరోపించారు. ఇండ్లు ఉన్నవారికే, పట్టా భూములు కలిగినవారికే దళారీలు ముడుపులు తీసుకొని ఇండ్లు కేటాయించారని పేర్కొన్నారు. నిజమైన పేదలు దారుణంగా న్యాయానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మాజీ ఎంపీ రేణుక చౌదరికి వినతిపత్రం అందజేశారు.