ఇల్లెందు మండలంలో పౌరసరఫరాల డీటీ పాషా బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. చల్లసముద్రంలో వి. వెంకటరమణ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న 9 క్వింటాళ్లు, నంబర్ 2 బస్తీలో కె. సారయ్య ఇంట్లో 12 క్వింటాళ్లు, సివిల్న్ ఏరియాలో మహాబూబి ఇంట్లో 10 క్వింటాళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.