కామేపల్లి సమీపంలో సోమవారం ఇల్లందు- ఖమ్మం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.