ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

ఇల్లందులోని పెద్దమ్మ గుడి మూలమలుపు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాగర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. గార్ల మండలం సిరిపురానికి వెళ్తున్న ముగ్గురు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ మూల మలుపుకు సంబంధించి ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్