ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లింగన్నకుంట- జామలపల్లి రహదారిపై గురువారం ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి విజయ్ అనే యువకుడి మృతి చెందారు. మృతుడు ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామపంచాయతీ వేములవాడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ అని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్