బయ్యారం: ఇల్లందు ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

బయ్యారం మండలం చొప్లతండాలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ తాకింది. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేను తండావాసులు అడ్డుకున్నారు. తమ తండాకు ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం పట్ల ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశారు. ఎన్నికల సమయంలో తమ తండాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చి, గెలిచాక ఇప్పుడు తమ తండాకు ఒక్క ఇళ్లు కూడా కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్