తెలంగాణ వేదికగా జరగనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 లోగో, మస్కట్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సీఎం రేవంత్ ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుంచి 22, 2026 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 27 మెడల్ విభాగాల్లో 6,000 మందికి పైగా క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఈ ఎడిషన్‌లో సాఫ్ట్‌బాల్ (Softball) తొలిసారిగా పోటీ క్రీడగా అరంగేట్రం చేస్తుండటంతో యువ క్రీడాకారుల ప్రతిభకు గొప్ప వేదికగా గేమ్స్ నిలవనున్నాయి.