కూతురి పెళ్లిలో ఖుష్బు ఎమోషనల్.. వీడియో వైరల్

ప్రముఖ సీనియర్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక సుందర్, శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహం జూన్ 25న గోవాలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధిక, సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవంతిక చెల్లెలు ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది.

సంబంధిత పోస్ట్