ఏపీకి కియా సంస్థ మరో రూ.14,167 కోట్ల పెట్టుబడి

దీపావళి పండుగ వేళ ఏపీకి భారీ పెట్టుబడి శుభవార్త అందింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్, రాష్ట్రంలో తన ప్లాంట్‌ను విస్తరించేందుకు సుమారు రూ. 14,167 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం 3 లక్షలుగా ఉన్న కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షలకు పెంచాలని సంస్థ యోచిస్తోంది. విశాఖపట్నంలో జరగనున్న ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఈ మేరకు అధికారికంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕