తల్లిగా మారిన తర్యాత జీవితం 360 డిగ్రీలు మారింది: కియారా అద్వానీ

మాతృత్వంతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి కావడం అనేది తన జీవితాన్ని 360 డిగ్రీలు మార్చేసిందన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తనలో రక్షణ భావం విపరీతంగా పెరిగిందని, తాను ఒక ఆడపులిలా మారిపోయానని  వ్యాఖ్యానించారు. 2025 జూలైలో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారికి `స‌రాయా` అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్