6,600 ఏళ్ల నాటి సమాధుల్లో కిలోల కొద్దీ బంగారం లభ్యం!

బల్గేరియాలోని వర్ణా నగరంలో 1972లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 6,600 ఏళ్ల నాటి 62 సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 4600 నుంచి 4300 మధ్య కాలానికి చెందిన ఈ ఆభరణాలు, ఆ కాలంలోనే బంగారంపై మోజు, సామాజిక అంతరాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 'గ్రేవ్ 43'లో ఒక మృతదేహం వద్ద కిలోన్నరకుపైగా బంగారం లభించింది. ప్రస్తుతం ఈ ఆభరణాలు వర్ణా ఆర్కియాలజికల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్