దర్శకుడు సత్యారెడ్డి రూపొందిస్తున్న ‘కింగ్ బుద్ధ’ చిత్రంలోని ‘వుయ్ వాంట్ వరల్డ్ పీస్’ పాటను శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ సునీల్ సేనేవి విడుదల చేశారు. ప్రపంచ చరిత్రలో బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా ‘కింగ్ బుద్ధ’ నిలుస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సత్యారెడ్డి తెలిపారు.