నార్వే కింగ్ హ‌రాల్డ్ క‌న్నుమూత

నార్వే దేశ రాజు హెరాల్డ్ V (89) శుక్రవారం కన్నుమూశారు. నార్వే రాజధాని ఓస్లోలో ఆయన తుది శ్వాస విడిచినట్లు రాయల్ ప్యాలెస్ ప్రకటించింది. ఆగస్టు 17న రక్త సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం చికిత్స సమయంలో క్షీణించింది. ఆయన కుమారుడు, 53 ఏళ్ల హాకన్-8, నార్వే రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారు. దివంగత రాజు హెరాల్డ్ నార్వేలో ప్రజాదరణ పొందారు, రాచరిక వ్యవస్థను ఆధునీకరించారు. ఆయన ఒక సాధారణ మహిళను వివాహం చేసుకున్నారు. రాయల్ కుటుంబ ఖర్చుల్లో పారదర్శకత పాటించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు స్కామ్‌లలో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్

✕
✕