వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 28,017* పరుగులు సాధించి, శ్రీలంక ఆటగాడు కుమార్ సంగక్కర (28,016)ను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ తెందూల్కర్ (34,357) మొదటి స్థానంలో ఉన్నారు.