కిషన్‌రెడ్డి మెట్రోకు అడ్డుపడుతున్నారు: సీఎం రేవంత్

TG: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్‌రావు నగర్‌లో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనతో ఉండే నాయకులను గెలిపించుకోవాలిని ఓటర్లను కోరారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా తేలేదన్నారు.

సంబంధిత పోస్ట్