కివీ పండు.. అతిగా తింటే అనర్థమే!

కివీ పండులో విటమిన్-సితో పాటు అనేక పోషకాలు ఉన్నప్పటికీ.. అతిగా తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కివీలోని ఆక్టినిడిన్ అనే ప్రోటీన్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు, నోటిలో మంట, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. అధికంగా తింటే గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటివి కలుగుతాయి. గుండె, రక్తపోటు మందులు వాడేవారు, రక్తాన్ని పలుచబడే మందులు వాడేవారు కివీ తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్