భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్థిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్(107) సెంచరీతో చెలరేగాడు. మిచెల్ బ్రేస్వెల్(65), ఫిన్ అలెన్(31), డారిల్ మిచెల్ (24) పరుగులు చేశారు. కివీస్ బ్యాటింగ్ ముందు భారత్ బౌలర్లు తేలిపోయారు. మయాంక్ 3, అక్షర్, ప్రిన్స్, అర్ష్దీప్, నితీశ్ తలో వికెట్ తీశారు. టీమిండియా గెలవడానికి 260 పరుగులు చేయాల్సి ఉంది.