ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. CSK ఇచ్చిన 104 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 10.1 ఓవర్లలో ఛేదించింది. KKR బ్యాటర్లలో సునీల్ నరైన్ 44 పరుగులతో రాణించారు. CSK బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు.