ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా, మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. గతేడాది వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లతో బలోపేతమైంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు జరగగా, ముంబై 24 విజయాలతో ఆధిక్యంలో ఉంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండనుంది.