పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు అవినాశ్​పై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న ఉదయం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో పోలీసులను గాయపరిచి పరారైన నిందితుడి కోసం గన్నవరం, కంకిపాడు సీఐలు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల సమయంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అవినాశ్​ పోలీసులపై కత్తి, రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆత్మరక్షణ కోసం కంకిపాడు సీఐ నిందితుడు అవినాశ్​ కాళ్లపై కాల్పులు జరిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕