టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన అకౌంట్‌కి ‘User Not Found’ అని రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నా ఇన్‌స్టాలో మాయం కావడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే కొద్దిసేపటి తర్వాత కోహ్లీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అన్న వచ్చాడోచ్’ అంటూ మీమ్స్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.