టీ20లో 4,188 పరుగులు చేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 125 టీ20లు ఆడిన కోహ్లీ.. 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌ సాధించిన కొద్దిమంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్టులో విరాట్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోనీ, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్