55 ఏళ్ల గాన ప్రస్థానంలో ప్రజల అభిమానమే అత్యున్నత పురస్కారమని భావించిన గాన కోకిల ఎస్. జానకి, 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన ఆమె, ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని, ప్రజల గుర్తింపే ముఖ్యమని తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ.. ప్రజల అభిమానంతో ఉన్నత స్థానంలో ఉన్నాననే భావనతోనే ఆమె అవార్డును వద్దనుకున్నారని తెలిపారు.