కోల్‌కతా అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య

కోల్‌కతా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. గోదాంలో మండే పదార్థాలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గంటల తరబడి శ్రమించినా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్