ఆసిఫాబాద్‌లో 98% ఎస్‌ఎస్‌సీ ఫలితాలు: కలెక్టర్

2025-26 విద్యా సంవత్సరానికి గాను జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఆసిఫాబాద్ జిల్లా 98 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 37 ఆశ్రమ పాఠశాలల్లో 13 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం 1,302 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 1,276 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 531 మంది బాలురు, 745 మంది బాలికలు ఉన్నారు. జైనూర్, కోహినూర్, మహాగావ్ వంటి పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్