తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోసం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమ వేదికలను పెంచేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంది. మండలంలో ఒకే వేదికలో నిర్వహించిన ప్రసారం ఇప్పటి నుంచి 2 వేదికల్లో ప్రసారం కానుంది. కొమురం భీం జిల్లాలో 15 వేదికలు ఉండగా ఇప్పుడు 30 కి పెంచారు. రైతులకు వ్యవసాయ సూచనలు ఇవ్వడాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు