ఆసిఫాబాద్: 282 జీవోను వెంటనే రద్దు చేయాలి: ఏఐటీయూసీ డిమాండ్

పని గంటలను ఎనిమిది నుంచి 10కి పెంచిన 282 జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం రెబ్బెనలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్మిక హక్కులను కాపాడేందుకు అవసరమైతే కార్యాలయాలు, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్