కోయతెలండి గ్రామంలో 50 మంది బీఆర్ఎస్ లో చేరిక

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని, రాబోయే పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ తిర్యాణి మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీష్ అన్నారు. సోమవారం కోయతెలండి గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన ఆత్రం దిందర్శ, ఊయిక రాజు, నైతం జైత్, ఆత్రం తిరుపతి, నైతం సోనీరావు, ఊయిక గుణవంత్ రావు తదితరులతో పాటు మరో 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. గత బీఆర్ఎస్ పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నారని, మండలంలో అధిక స్థానాలు గెలుస్తామన్న నమ్మకం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్