కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌లో శనివారం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ సహకారంతో 87 మంది గిరిజన లబ్ధిదారులకు సోలార్ లైట్లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, విద్యుత్ సౌకర్యాలు తక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో సోలార్ లైట్లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ సంజయ్, ఎస్‌ఐలు సుబ్బారావు, సురేష్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.