గోలేటిలో కొండ దేవయ్య పటేల్‌కు ఘన స్వాగతం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్‌కు సంఘం నాయకులు, కుల బాంధవులు ఘన స్వాగతం పలికారు. గోలేటి ఎక్స్‌రోడ్డు నుంచి జీటీసీఓఏ క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంఘ ఐక్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపుల అభివృద్ధి, సామాజిక పురోగతి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ పట్టణ, సిర్పూర్ తాలూకా, రెబ్బెన మండల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, గోలేటి గ్రామ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్