జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలి: టీయూడబ్ల్యూజే

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, వారి రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టం తేవాలని జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా అంబేడ్కర్ చౌక్, వివేకానంద చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕