కాగజ్‌నగర్ వద్ద థర్డ్ లైన్ పనుల్లో ప్రమాదం: కార్మికులకు గాయాలు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలోని రాలపేట బ్రిడ్జి వద్ద థర్డ్ లైన్ పనుల్లో 08-04-2026 మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అసిఫాబాద్ రోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య గిర్డర్ అమర్చే సమయంలో జాక్ ఫెయిల్ అవడంతో కార్మికులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రక్షణ పరికరాల లేమి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్