కొమురం భీం జిల్లాలో ఎరువుల దుకాణాలు రైతులను దోపిడీ చేస్తున్నాయని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం ఆరోపించారు. యూరియా బస్తా అధికారిక ధర రూ. 266. 50 ఉండగా, కొందరు వ్యాపారులు రూ. 350 నుంచి రూ. 370 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ సీజన్‌లో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నా అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.