జనకాపూర్‌లో ఆఫ్టర్ కేర్ సపోర్ట్ క్యాంప్ విజయవంతం

ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్‌లోని బాల రక్ష భవన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్టర్ కేర్ సపోర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్‌షిప్ పథకం లబ్ధిదారులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీసీపీఓ బూర్ల మహేష్ మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం ద్వారా అర్హులైన పిల్లలకు నెలకు రూ. 4000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను పిల్లల విద్య, ఆరోగ్యానికి మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్