ఆసిఫాబాద్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీపీఐ(ఎం) ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలు, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమకాలీన రాజకీయ పరిణామాలపై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీపీఐ(ఎం) నాయకులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, గుడిసెల కార్తీక్, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.