SIR నోటీసు ఫామ్‌ను బీఎల్‌వోకు అందజేసిన ఆనంద్‌రావు

కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని కెరమెరి మండలంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన (SIR) ప్రక్రియలో భాగంగా, సీఐటీయూ మండల కన్వీనర్ కూటికెల ఆనంద్‌రావు తనకు అందిన నోటీసు ఫామ్‌ను బీఎల్‌వో గుణసుందరికి మంగళవారం సమర్పించారు. ఓటరు జాబితాలో వివరాల పరిశీలన, సవరణల కోసం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని, కోరిన వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారంతో ఫామ్‌ను బీఎల్‌వోకు అందజేసినట్లు ఆయన తెలిపారు. SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕