జైనూర్ మండలం కేజీబీవీ బాలికల పాఠశాలలో స్కావేంజర్ (కాంట్రాక్ట్ బేసిస్) పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నట్లు జైనూర్ ఎంఈవో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీసం 7వ తరగతి పాసై ఉండాలని స్థానిక మండలానికి చెందిన మహిళ అభ్యర్థి మాత్రమే రెసీడెన్స్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 7వ తరగతి మార్క్స్ మెమో జతచేయాలని పేర్కొన్నారు. ఈ నెల 19 లోగా దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.